Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారిపై మహిళా టీచర్‌ లైంగిక వేధింపులు.. ఫిర్యాదుతో అరెస్టు!

  • బాధితురాలు నాలుగేళ్ల ఎల్‌కేజీ విద్యార్థిని
  • తాకరానిచోట తాకుతూ నిత్యం అసభ్య ప్రవర్తన
  • విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయిని వక్రబుద్ధితో వ్యవహరించింది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. పాఠాలు చెప్పే టీచర్‌ అలా ఎందుకు చేస్తుందో కూడా అర్థం చేసుకోలేని ఆ చిన్నారి మూగవేదనను ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే...ముంబై మహానగరంలోని కుండివిలి ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల బాలిక ఎల్‌కేజీ చదువుతోంది. పాఠశాలలోని ఓ మహిళా టీచర్‌ ఆ బాలికను రోజూ తాకరానిచోట తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తోంది. ఏడుస్తున్న కుమార్తెను బాగా గమనించిన తల్లిదండ్రులు విషయంపై ఆరాతీశారు. టీచర్‌ ఇబ్బంది పెడుతోందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకుని నిందితురాలిని అరెస్టు చేశారు.
Mumbai
Kundivili
teacher S*x herashment

More Telugu News